మట్టికుండ లాంటి
పురాతనమంతా పరిమళమే
అనుకున్నంత సేపూ
ఈ లోకం నచ్చకపోవడం పెద్ద వింతేమీ కాదు
మరకతాలు పొదిగినవన్నీ
అలంకారమే అనుకుంటున్నామంటే
మనం నేర్చినవన్నీ మర్చిపోయి
మరోసారి కొత్తగా లోకాన్ని చదవాల్సిందే
మనసు పాత్ర మారనంత వరకూ
మట్టి కుండ అయినా
మరకతాలు పొదిగిన కలశమైనా
ఒకే ఆనందాన్ని నింపుకుని ఉంటాయి
అనంతమైన కాంతినీ…
గాడాంధకారాన్ని
ఆప్తంగా హత్తుకునే మనసే
నీ లోకాన్ని వెలిగించే ఆనంద దీపం







1 comments:
అందమైన అభివ్యక్తి. చాలా బావుంది.💐
Post a Comment