కలల్ని తొడుక్కున్న
యాంత్రికత్వం తోడుగా
ఈ గాలి ఎక్కడి నుండో
ఒక రాత్రిని కొనుక్కుని
వెంట తెచ్చుకున్నట్లుంది
కాసేపలా చల్లగా సేదతీరుదామని...
తనకేం తెలుసు... ?
ఈ నాగరికమెప్పుడో
రాత్రి తలం పై
కాంతి దీపాలని వేలాడదీసిందనీ
అవిప్పుడు వెచ్చని నీడలుగా వెలుగుతున్నాయననీ...
ఇక చల్లదనమంటే
నిన్న తను దాటి వచ్చిన నిజమని
తను చుట్టుకుని ఉన్నది…
కలల్ని తొడుక్కున్న యాంత్రికత్వాన్నేనని!







1 comments:
చాలా బావుంది
Post a Comment