కంటి కొసన వేళ్ళాడుతున్న
ఒక్క బిందువు చెబుతుంది
గుండె సవ్వడద్దుకున్న గాయాన్ని
ముఖమంతా పరచుకున్న
నిర్వేదం వెల్లడిస్తుంది
నిరీక్షణతో కుంగిపోయిన స్వప్నాన్ని
చర చరా నడిచెళ్ళిపోతుంది పచ్చదనం
వసంతంపై నీలాల వలని పరిచేస్తున్న
ఖాళీతనపు ఆక్రమణని చూసి
మనసంతా పొడిబారి
చిట్లిన మేఘంలా విడిపోతుంది
ఒక్క తడిస్పర్శా బంధనమై తాకక
శూన్యపు వాన
ఇంకా కురుస్తూనే ఉందనుకుంటే
వంట్లోకి నీరసం ఇంకుతున్నట్లే ఉంటుంది
చాలిక దీనత్వం
వలదిక వగపు స్వరం
నరం నరం
మరిగే నెత్తుటి ఖజానాయేనన్న
నిజం గుర్తెరిగి చూడు
గుండె కవాటాలలో
మొదలవుతుందో రుధిర థిల్లానా
ఒక ధైర్య వచనాన్ని
వీర తిలకంగా దిద్దుతూ







0 comments:
Post a Comment