ఏయ్ హనీ...
నీవు నా వడిలో తల
పెట్టుకుని పరుండినప్పుడు నీ అద్భుత సోయగాల సౌందర్యాన్ని నా కన్నులారా
వీక్షించాను... నా నయనాలెంత పుణ్యం చేసుకుని ఉంటాయో కదా...
నీ సౌందర్యాన్ని చూసిన
మొదటి క్షణం నుండి ఇప్పటి వరకూ నా కన్నులు రెప్ప వాల్చలేదు... లేకుంటే నీ
సౌందర్యాన్ని చూసిన అనుభూతి వాటికి దూరమవుతుందట. నేను అనిమిషుడిని కాకున్నా
ప్రస్తుతం అదే స్థితిలోకి వెళ్ళిపోయాను.
ఇప్పుడు మాత్రం నా
కళ్ళు రెప్పవాల్చటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటావా...! నీ
సౌందర్యాన్ని చూసిన ఆ క్షణం కన్నా
అద్భుతమైన మరో క్షణం లో నీ అందం ద్విగుణీ కృతమై కనపడితే చూసి తరించాలని వాటి కోరికట.
ఈ లోగా చిన్న అలసట తీర్చుకుని మళ్ళీ కొత్త
ఉత్సాహంతో నిన్ను చూడాలనే తపన వాటికి.
అందుకే వాటి బాధ తీర్చటానికి వాటి అనుభూతిని
నా మనసుకు రవాణా చేసినాను. ఆ క్షణం నుండి నా మెదడు ఆ భావాన్ని బయటకి వ్యక్తం
చెయ్యమని ఒకటే గొడవ చేస్తుంది. లేకుంటే ఇంతటి అందం ఇలనుందని నమ్మలేక తనకు పిచ్చి
ఎక్కుతుందని భయ పడుతుంది.
నీ సౌందర్యంతో
నాకెన్ని అందమైన చిక్కులు తెచ్చిపెట్టావు
హనీ... ఏదో నా పిచ్చిగానీ ఇవన్నీ చిక్కులా ఏమిటి? మధురమైన బాధలు కదా... నా ఆనందాన్ని
రెట్టింపు చేస్తూ...!
నీ హృదయాన్ని వెన్నెల
లోని చల్లదనంలో ముంచి స్పందనలనే భావావేశాలని అనుభూతుల ఉరవడిలో, జాలి – దయల వెల్లువతో రంగరించి నీలో ప్రవేశపెట్టినట్లు ఉన్నాడు
ఆ బ్రహ్మ.
కనుకనే నీ హృదయ స్పందనలలో
నా హృదయాన్ని కట్టివేయగలిగావు. నా మనసు పడే వేదన చూడలేక దయతో జాలిగా మాత్రం నన్ను
ప్రేమించవద్దు. నన్ను నన్నుగా నా ప్రేమని అర్ధం చేసుకుని నన్ను ఇష్టపడితే అంతకన్నా
నాకేం కావాలి?
నా కంటి పాపల్లో నీ
రూపు
నా మనసు పొరల్లో నీ
హృదయం
నింపాయి ప్రేమను నా
మదిలో
వేశాయి బంధం నా
ఎదలో
వెన్నెల లోని చల్లదనంతో
చందమామలోని నిర్మలత్వంతో నాలో రస స్పందనల్ని కలగ చెయ్యగలిగే అభినవ ప్రేమ కవితవు
నువ్వు...
నీ
...రేష్










