ఎగరేస్తున్న ఆశలకు తోడుగా కాస్త శ్రమని కట్టి చూడు
కావాలనుకున్నదేదో కదిలివస్తుంది కాలం బాటన
ఎగశ్వాస బతుకులకి కాస్త ఊపిరి అద్దు
నీ వెనకే కొన్ని నీడలు నిలబడిపోతాయ్ నమ్మకంగా
దగ్ధమైన దేహాన్ని పరికించి చూడు
గాలిలో కనపడుతుంది రేణువులుగా విచ్చిన్నమైన తాపత్రయమొకటి
కాసేపలా మట్టికి ప్రణమిల్లి చూడు
కంపనలని మరచి మనసారా పంటగా నవ్వుతుంది
తడి లేనిదని మొద్దుబార్చకలా
మనసు వర్షిస్తే చెమరింపు అద్దుకునే ఆ గుండెని
బాట చిధ్రమయిందనే చింత మానేసెయ్
కొత్తదారి మొలుస్తుంది చూడు నీ పట్టుదలతో
వంటి నిండా గడ్డిపువ్వుని ఆవాహన చేసుకో
ఎందరు తొక్కేసినా మరింత ఠీవీగా నిలబడేందుకు
ప్రతి క్షణపు కొనకు ఓ నవ్వు కట్టేసెయ్
లోకం మొత్తం నీ చిత్తం అవుతుంది మధురంగా

0 comments:
Post a Comment