11:20
Unknown
ఉహూ...
ఇంకా తన సవ్వడవ్వలేదు
అసలు మొదలైందా… లేదా తెలియటం లేదు
పరిమళమూ వీయలేదు
ఆనందమా… వ్యధా
ఏదీ బయట పడటం లేదు
నిరీక్షించాలా
ఎదురేగాలా
ఏదీ తట్టటం లేదు
మనసు కదా
అప్పుడప్పుడూ అంతే మరి
అక్కడక్కడా ఆగిపోవాలి
నేనెక్కడో నాకే తెలియనంతగా
కొన్ని క్షణాలని నిశ్శేషం చేసుకుంటూ
0 comments:
Post a Comment