ఫాబ్రికేటేడ్ స్వామీజీల మాన్యుఫాక్చర్డ్ దేవుళ్ళ ముందు
మోకరిల్లే వాళ్ళంతా అమాయకులేం కాదు
ఇన్స్టంట్ వరాల కోసం హుండీ నింపే మోడరన్ మాహా భోక్తలు
ప్లాస్టిక్ పూలకి
యాంత్రిక సుఖాలకీ అలవాటు పడ్డ మనుషులకి
ఇప్పుడు
ఫేస్బుక్ రియాక్షన్స్ వాట్సప్ ఏమోజిలతో తప్ప
ఒరిజినల్ ఫీలింగ్స్ తో అవసరాలు కనపడవు
అరచేతిలోనే ఎక్స్టసీ నిండి పోయిన చోట
పంచభూతాల స్పర్శని వికృతిగా ఆలోచించటం
ఒక నిర్వచించబడని సత్యమై మెదళ్లనిండా నాటుకుపోతుంది
ఇప్పుడింతే
స్వభావసిద్ధమైనవన్నీ యంత్రపరిమళాన్ని అద్దుకుంటూ
సహజత్వమంటే గేలిచేస్తున్నాయ్
ఇప్పుడిక యంత్రం చెయ్యల్సింది ఒకటే మిగిలినట్లుంది
మనిషిని పుట్టించటం మనసుని ప్రోగ్రాం చెయ్యటం
ఎవరికి తెలుసోయ్ !
బహుశా రేపటి వారసత్వమంతా
త్రీడీ ప్రింటింగ్ నుండి బయటకు వచ్చే
డిజైనర్ హ్యమన్ మెషీన్స్ కావచ్చేమో







0 comments:
Post a Comment