శూన్యాన్ని తాగిన ఆకాశం
మత్తుగా నిదరోతున్నట్లుంది
చుక్కల్ని లోకం మీదకి వదిలేసి
రావి ఆకుపై పరుచుకున్న
వసంతపు పరిమళం
ప్రకృతిని మెత్తగా తడుముతుంది
వాన చినుకుల్లాంటి రంగులలో
దాగిన నిశ్శబ్ద వర్ణమొకటి
నాలో ప్రతి ధ్వనిస్తుంది నీలా
అప్పుడప్పుడూ
అవిశ్రాంతపు ప్రశాంతత కూడా
తెలియని ఉన్మత్తాన్ని రేపుతుందనుకుంటా
ప్రాణస్పర్శవైన నిన్ను కంటకాల బాటకి నెట్టేస్తూ
ఒక అలజడిని వడివడిగా ఆహ్వానించుకుంటూ







1 comments:
వాన చినుకుల్లాంటి రంగులలో దాగిన నిశ్శబ్ద వర్ణమొకటి నాలో ప్రతిధ్వనిస్తుంది నీలా... 💗
Post a Comment