Sunday, 29 March 2015

ఎవరివి నువ్వు

తడి తడిమిన ప్రతిసారీ
లాలనగా  కురిచేస్తున్నావ్
గుండెని గుత్తకు తీసుకున్న ఓదార్పువై

కలలు రాలిన ప్రతిచోటా
నవ్వుగా మురిపిస్తున్నావ్
జీవితాన్ని చిగురింపజేస్తున్న వాస్తవంలా

బ్రతుకు వెలివేసినప్పుడల్లా
నీడగా వచ్చేస్తున్నావ్
చెవులతో మనిషిని చదివే మేధావులని ధిక్కరిస్తూ

ఏయ్…
ఇంతకూ ఎవరివి నువ్వు?
గుండె గదులలో అలికిడి చేస్తున్న ధైర్యానివే కదూ...


4 comments:

ప్రతి పదం అద్భుతం..
బ్రతుకు వెలివేసినప్పుడల్లా
నీడగా వచ్చేస్తున్నావ్..
ఇక్కడ మాత్రం మనసు గట్టిగా హత్తుకుంది.

థాంక్యూ పద్మార్పిత గారు

Thank you Ghousuddin Shaik garu

Post a Comment