తొలకరి స్వాగతాలతో
వాన తోరణాలు కడుతుంటే
ఆకుపచ్చని పతకమైన పైరు
పొలానికి అలంకారమయ్యాక
రైతింట ఆకలొకటి చిధ్రమయ్యింది
తడికళ్ళకి స్వప్నతాంబూలాలనందిస్తూ
****
అమ్మవడిలో చోటుకోసం
చిన్ని పాదాలతో
దిగంతాలలో చిందులేసే
సూర్యచంద్రుల పోటీల్లో
పగలంతా నాది
రేయంతా నీది
గిల్లికజ్జాలు మనవి
***
అక్షతలుగా జల్లుకోను
చుక్కలనే కోసుకుంటూ
రాతిరికి వీడుకోలిస్తూ
పచ్చికనంతా నింపుకుని
పరవశాన్ని ఒంపుకుని
నువ్వు వేకువగా నడిచొస్తుంటే
ఊపిరి చప్పుడు చేసే
శ్వాసల థిల్లానా
నాదా
మరి ప్రకృతిదా...?







0 comments:
Post a Comment