‘ఏడవగలిగినంత దుఃఖం...
నవ్వగలిగినంత సంతోషం’
అంతకు మించి మనిషి దేన్నీ తట్టుకోలేడు కదా...
మనిషి ఫీలింగ్స్ కీ ఒక సాచురేషన్ ఉంటుంది అన్నది అర్ధం అవుతుంది కదూ. ఏది ఎక్కువైనా మనిషి సోలిపోవటం సహజాతి సహజం. అదే లేకపోతే మనిషి జీవితమెప్పుడూ చిత్ర వధే.
అందుకే అనిపిస్తుంది... ఈ సృష్టి ఎప్పుడూ ఒక అద్భుత రహస్యమే అని...
***
రాత్రి...
ఎన్నిచీకట్ల భాండాగారమో...
అంతకన్నా ఎక్కువ ఆశల సమాహారం...
ఎన్నిచీకట్లు తాగిన రాత్రి అయినా ఒక వేకువతో వీడ్కోలు చెప్పటం ఎంత సహజమో... రేపొచ్చే పగలుని చూపిస్తూ ఒక ఆశావాదంలోకి నడిపించటం అంతే సహజంగా చేసేస్తుంది ధైర్యం.
రాత్రి కురిసేది విశ్రాంతి కోసమే... నేటి బతుకు విశ్లేషణతో ముగించిన రాత్రి... రేపటి వెచ్చటి వెన్నెల్లో నిన్ను విజేతగా నిలబెట్టదూ...

0 comments:
Post a Comment