Monday, 7 September 2009

శాంభవి.... టిబెట్ స్వేచ్ఛా ప్రధాత?


కోటప్ప కొండకు దైవ దర్శనానికి వెళ్ళిన శాంభవి అనే బాలికను అదే పనిగా రోజు అంతా TV9 లో చూపిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు పాప గురించి కొన్ని వార్తలు చదివాను కానీ ప్రత్యక్షం గా తన మాటలు విన్నది మాత్రం రోజే.
చిన్ని పాపని చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది. తను వల్లె వేస్తున్న మాటలు అంత కన్నా ముద్దు ముద్దు గా ఉన్నాయి.
కానీ మాటల్లో సత్యాసత్యాల సంగతేమిటో నాకైతే అంతుబట్టటం లేదు.
నిజానికి పాపలో అద్భుత గ్రాహక శక్తి ఉండి ఉండాలి.దానిని ఎవరైనా స్వార్ధ పరులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. తను చెప్పే విషయాల్లో ఏదీ నమ్మశక్యం గా లేవు.
తను దలైలామా పూర్వ జన్మలో స్నేహితులట. ఇద్దరూ కలసి గౌతమ బుద్ధుని వద్ద శిష్యులు గా ఉండే వారట. టిబెట్ కి ఇంకొక 3 సంవత్సరాలలో (2012)స్వాతంత్ర్యం ఇప్పించటానికే తాను జన్మించిందట. వీర బ్రహ్మేంద్ర స్వామి వీర భోగ వసంత రాయలు గా 2012 లో జన్మిస్తారట. మంచి వాళ్ళని రక్షించి పిచ్చి వాళ్ళని (చెడ్డ వాళ్ళని కాదు) సంహరిస్తాడట. 2012 లో మంచి భూమి మిగిలి చెడ్డ భూమి నాశనం అవుతుందట. (భూమి లో మంచీ చెడ్డా నాకు అర్ధం కాలేదు).
భారత దేశం బాగానే ఉంటుందట కానీ చైనా, పాకిస్తాన్ & అమెరికా దేశాలు నాశనమైపోతాయట. (బహుశా చెడ్డ భూమి అంటే మనదేశానికి శతృదేశాలేమో అనిపించిది తను చెప్పిన మాటలు విన్నాక)...
ఇవన్నీ విన్నాక నాకు కొన్ని సంగతులు అర్ధం కాలేదు.
2012 లో సునామీ లు, భూకంపాలు వచ్చి చైనా నేలమట్టమై పోతే ఇక ప్రత్యేకం గా టిబెట్ కి స్వాతంత్ర్యం ఇప్పించటానికి తాను జన్మించవలసిన అవసరం ఏమిటి.
చైనా, పాకిస్తాన్, అమెరికా తదితర దేశాలు సునామీ లు, భూకంపాలు వచ్చి నాశనం అయిపొతే వీరభోగ వసంతరాయలు చ్చి ఏం చేస్తారు?
మధ్య జులపాల స్వామి వారు తమ ముఖార విందాన్ని రాత్రికి చందమామలో దర్శించమని తరువాత తూఛ్... తూఛ్.... ఇప్పుడే కాదు అన్నట్లు, కొన్నాళ్ళాగాక బహుశా 2012 లో) పాప చేత కూడా నాకు దేవుడి నుండి సందేశం వచ్చింది ఇంకా పాపం పూర్తిగా పండలేదు అందుకే ఇంకా టిబెట్ కి స్వేచ్ఛ రాలేదు అనిపించరంటారా?
ఇలా అంటున్నానని నేనేం నాస్తికుణ్ని కాదు. కానీ దేవుడి పేరు చెప్పి చిన్న పిల్ల చేత ఇలా చెప్పిస్తున్నారేమో అని బాధ గా మాత్రం ఉంది.
మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

8 comments:

శెహభాష్! స్నేహితుడు!

ఆ క్లిప్పింగులు చూసివుంటే నేనే ఓ టపా వ్రాసేవాణ్ణి!

మీ లాంటివాళ్ళే ఇప్పుడు కావలసింది.

కీపిటప్!

మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు కృతజ్ఞతలు కృష్ణశ్రీ గారు

I believe this is another way of cheating the people in the name of God!

వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభోగ వసంతరాయలుగా కలియుగాంతంలో వస్తానన్నాడు. అతను వచ్చేటప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా వివరించాడు. అతను రావడానికి ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది.


అలాగే కాలజ్ఞానంలో తామే వీరభోగ వసంతరాయలుమని చెప్పి, ప్రజలను మోసం చేయప్రయత్నిస్తారని, వాటిని నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండమని కూడా చెబుతాడు.

మీరు చెప్పింది నిజమే చిన్న పాప ముద్దు ముద్దుగా ఏదేదో చెప్పేస్తుంది.
ఇంకో మానవ నిర్మితమైన అమ్మ తయారవబోతోంది. ఆ అమ్మాయికి అంభానీ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. త్వరలో సూర్య నందిలో ఆష్రమం కట్టిస్తాననీ మాట కూడా ఇచ్చారట.
దలైలామా కూడా ఆమే తనూ పూర్వ జన్మ మిత్రులని అంగీకరించారట.

అనట్టు బ్లాగుల్లో సగం తెలిసీ ఊహాగానాలతో రాసేవాళ్ళే ఎక్కువ బ్లాగు వార్తలు పూర్తి నిజాలు అనుకునేరు.
ఈ బ్లాగులు రాసేవాళ్ళంతా టీవీ సమాచారాన్ని రెగ్యులర్ గా ఫాలో అవరు. తెలిసీ తెలియని వార్తలతో చంపుకుతింటారు.
మరీ హాఫ్ నాలెడ్జ్ గాళ్ళ బ్లాగుల్లా ఉన్నాయి తెలుగు బ్లాగులన్నీ.
ఈ మధ్య ఓ కొత్త బ్లాగు తృష్ణ అని రాస్తుంది అది మరీ ఘోరం నాలుగో తరగతి స్టాండర్డ్.

This comment has been removed by the author.

@ మలక్ పేట్ రౌడీ గారూ... మీ అభిప్రాయానికి ధన్యవాదాలు

@ నాగ ప్రసాద్ గారూ... నాకు తెలియని విషయం చెప్పినందుకు కృతజ్ఞతలు

@ అజ్ఞాత గారూ... తృష్ణ బ్లాగ్ సంగతి నాకు తెలియదు కానీ మీరు నన్ను పొగిడారో తెగిడారో అర్ధం కాలేదండీ

@ నందకం గారూ... మీ అభిప్రాయం తీసేసారు. అయినా కానీ మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు (మెయిల్ లో మీ అభిప్రాయం వచ్చిందండీ)కృతజ్ఞతలు.

అజ్ఞాత గారూ - బ్లాగు లు చాలా మటుకూ డైరీల్లాంటివి. లేదా అరుగు మీద కూచుని చెప్పుకునే కబుర్ల లాంటివి. వాటిల్లో అథెంటిసిటీ మాట పక్కనుంచండి - ప్రధాన వార్తా సంస్థలే - తమ వార్తల్లో అథెంటిసిటీ కి గారంటీ ఇవ్వవు. ఒక వేళ చిక్కుల్లో పడతామూ అనుకుంటే, ఫలానా సోర్స్ ద్వారా ఈ విష్యాలు తమకు తెలిసాయీ అని చెప్తాయి. ఆ సోర్స్ ని మనం నమ్మొచ్చో నమ్మనక్కర్లేదో చాలా మటుకూ కాలమే నిర్ణయిస్తుంది. బ్లాగుల్లో టీవీ చూసి ఏమేమో రాస్తారంటున్నారు కదా, ఎంత ఓపికా, తీరికున్న మనిషయినా ఒక స్టోరీ ని రోజుల తరబడి టెలివిజన్ చూసి ఫాలో కాలేడు. తమకు తెలిసున్న వరకూ ఒక విషయం మీద బ్లాగు లో చర్చించి, ఇంకా దాని గురించి తెలుసుకునే ప్రయత్నమో, ఆ విషయం తనలో కలిగించే నిస్ప్రుహ నో తెలియచెప్పే అధికారం ప్రతీ వ్యక్తికీ ఉంది. కాబట్టి, మీరన్న మాటలతో నేను విబేధిస్తున్నాను.

స్నేహితుడు గారు : శాంభవి గురించి అంతా అయోమయంగా అనిపిస్తూంది. మీడియా ప్రస్తుతానికి ఆమెను వొదిలేస్తే బావుంటుంది. తను చెప్పిన 'డి-డే' దగ్గరపడితే, మీడియా కంగారుపడినా బావుంటుంది. దలై లామా ఇపుడు నిస్సహాయుడు ! ఆయన కి ఈ పిల్ల ఒక గడ్డి పోచ లాగా అనిపిస్తూ ఉండి ఉండొచ్చని కొందరి విశ్లేషణ !

Post a Comment