Tuesday, 15 September 2009

వీరాధి వీరుడా స్టారాధి స్టారుడా.... డిపాజిట్ ఏదయ్యా?సినీ వినీలాకాశం లో అగ్ర తారగా ఓ వెలుగు వెలుగిన మెగా స్టారుడా అచ్చిరాని రాజకీయాలు నీకెందుకయ్యా...?

మళ్ళీ నీ మార్కు వ్యంగ్య భరిత డైలాగులతో సినిమాలు తీసుకుంటే ఉపయోగం ఉంటుందేమో ఆలోచించవయ్యా....

ఝెండా పీకేద్దాం అనగానే ఉగ్రనరసిహుడిలా ఆవేశ పడితే, రామోజీ రావుగారు ఝెండా పీకేద్దాం అనే వార్తాకధానం ప్రచురించి ఒక విధం గా మీకు మంచే చేసారనుకున్నా. ఇంకేముంది చాలెంజ్ సినిమా లో లా మీ సత్తా టెక్కలి ఉప ఎన్నికలనుండి చూపించటం మొదలెట్టేస్తారు అనుకున్నా.

సానుభూతి వల్ల మీరు (మీ పార్టీ అభ్యర్ధి) గెలవలేరు కానీ మంచి పోటీ ఇస్తారనుకున్నా. కానీ జనాలకి మీ మీద ఎంత నమ్మకముందో చూడండి. ఆరు నెలల్లో మీ ఓటర్లను సగం తగ్గించేసింది.

మీరు అన్నారు సానుభూతి వల్లే కాంగ్రెస్ గెలిచింది అని. అది నిజమే అనుకుందాం మరి తెలుగుదేశానికి ఏం సానుభూతి ఉండి కాంగ్రెస్ తో పోటాపోటీగా రాగలిగారు.
అంటే ఇప్పటికి కూడా ప్రజలకి ప్రత్యామ్న్యాయం గా తెలుగుదేశాన్నే భావిస్తున్నారు.

అంటే ప్రతిపక్ష పాత్ర మీకంటే వారు పోషిస్తున్నారనే కదా. మీరు ప్రతిపక్ష పాత్ర సరిగ్గా నిర్వర్తిస్తుంటే జనాలు మిమ్మల్ని కూడా ఇంకా గోదా లోనే ఉంచేవారు.

ఆటలో విజయం కోసం చూసే ఆటగాడి కంటే, ఒక జట్టు కి అనుకూలంగా నిర్ణయాలు వెలువరించే అంపైర్ ని జనాలు మీలో చూసారు కాబట్టే మీకు పడాల్సిన ఓట్లు కూడా ఆ జట్టు ఖాతాలోకే వేసేసారు జనాలు.
మీరు వచ్చింది మార్పు కోసం అన్నారు. సినిమా లలో మీకున్న అభిమానుల్ని మీ వోటర్లు గా మార్చుకోలేని మీరు మా జీవితాల్లో ఏం మార్పు తీసుకువస్తారు.

జనాలు మీ నుండి ఆశించింది మార్పుని. ముందు ఆ మార్పుని మీలో , మీ బావ మరిదిలో, మీ నాయకుల్లో & మీ పార్టీ పునాది రాళ్ళల్లో తీసుకు రండి.

కాంగ్రెస్ లో ఎవర్ని ముఖ్యమంత్రి ని చెయ్యాలో మీ శాసన సభ్యురాలి కి ఎందుకండీ?

అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. కానీ రాజకీయ పార్టీ లో పార్టీ అభిప్రాయమే బయట పడాలి కానీ ఎవరికీ వారు తమ తమ వ్యక్తి గత అభిప్రాయాలని ఇష్టం వచ్చి నట్లు పబ్లిక్ లో చెప్పుకుంటూ పోతే ఏది మీ పార్టీ అభిప్రాయమో ఏది వ్యక్తిగత అభిప్రాయమో చెప్పటానికి మీ పార్టీ తరపున ఒక ప్రతినిధిని పెట్టాల్సి రావచ్చు చూసుకోండి మాస్టారూ...

లేదంటే ఈ వ్యక్తిగత అభిప్రాయాలతో మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కి తోక పార్టీలా మారటానికి ఎక్కువ సమయం పట్టదు.


మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

8 comments:

మంచిగా సెలవిచ్హారు. అల్లు అరవింద్,చిరంజీవి లు తప్ప మిగతా వాల్లెవరు పెర్మనెంట్ కాదు ఆ పార్టీ లో. అథిది లాగ నో లెక పుట్టింటి మీద అలిగో అలా వచ్చిపొయె సత్రమాయె ఆ పార్టీ! కులగజ్జి కి సామాజిక న్యాయమని ఒక అలియస్ పేరు తగిలించి అప్పనంగా అధికారం లోకి వస్థామని కలకన్నాదు. జయప్రకాష్ నారాయణ్ తొ చేయి కలిపింటే ప్రజలు హర్షించే వారు. ఇంక దుకానం మూయడం బాకీ వుంది !

mee blog lay our bagundi .. kani telugu cut paste cheste pani cheyyadam ledu ... there is some problem with it . .can u pls check ...

టెక్కిలి లో ఫలితం ఊహించిదే అని మెగా జోకర్ గారు జోకుగా చెప్పినాక కూడా, మీరు ఇలా ఉతికేయటం ఏమీ బాలేదు.
కాకపోతే మెగా జోకర్ గారి అభిమానిగా నా ప్రశ్న ఏమిటి అంటే, డెపాజిట్ కూడా రాదు అని ముందే ఊహిస్తే, పోటీకి నిలబెట్టను అన్న మాట మీదెందుకు నిలబడలేదని? సారీ ప్రశ్న ఆయన బామ్మర్ది గారిని అడగాలి కదా మర్చేపోయా!!!

"జెండా పీకేద్దాం" అనేది నిజంగానే ప్రజారాజ్యానికి కొంత మేలు చేసింది. అప్పటికప్పుడు పోవాల్సినవాళ్ళను ఆపింది. ఈలోగా రాజశేఖరరెడ్డి చచ్చిఫోడం ఇంకొంత ఆలస్యం చేసినట్టుంది. ఇక పుంజుకుంటుందిలెండి. వెళ్ళేందుకు తలుపుదగ్గరే నుంచున్న ఒక జంట ఎడంకాళ్ళు బైటపెట్టి, కాంగ్రెసు గుమ్మం దగ్గర పేర్లు చెప్పుకోని కుడికాళ్ళు లోపల పెట్టడంతోటి మొదలౌద్ది, జండా పీకడం.

చిరంజీవికి ప్రజారాజ్యం నాయకత్వం అనే చొక్కాని తొడిగారు. అదేమో ఆయనకి చాలా పెద్దదైపోయింది. తనలో నాయకత్వాన్ని పెంచుకుని ఆ చొక్కా సైజుకు పెరగనన్నా పెరగాలి. లేదా తన చొక్కా సైజును తగ్గించుకుని పార్టీలో సమష్టి నాయకత్వాన్ని పెంపొందించి, కుసింత చొక్కాని వాళ్ళకూ తొడగాలి. లేకపోతే ఆ పేద్దచొక్కాలో ఆ చిన్నపాటి మనిషి.. నిజంగానే జోకర్లాగే ఉంటాడు.

అయితే.., చిరంజీవికి ఇంకా సమయం మించిపోలేదు అని నా ఉద్దేశం.

@ శ్రీ .. there seems to be some jinx against these comment boxes that appear below the blog post. itself. If you first log in to blogger, then you won't have this problem.

@ చదువరి .. చొక్కా ఉపమానం అదుర్స్. ఆ మధ్య మన కవి సమ్మేళనంలో "చిరు తరువింక పూచి..." సమస్యకొచ్చిన పూరణలన్నీ ఒక సారి తలుచుకోవాలి! ఎంత ఆశాభావమో అప్పుడు!!

Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking and networking sites.

Telugu bookmarking and social networking sites gives more visitors and great traffic to your blog.

Click here for Install Add-Telugu widget

Post a Comment