Thursday, 10 September 2009

అశ్రువుకను రెప్పల మాటున
కను కొలనుల్లో పుట్టి
కను కొనల నుండి  జాలువారే ఓ కన్నీటి ముత్యమా

గుండెలో ఎగదన్నే బాధల నుండి
నన్ను సేద తీర్చడానికి
నీ జన్మస్థానానికి వీడ్కోలు చెబుతున్న క్షణాన
నీ పేరేమో దుఃఖాశ్రువు

మది నిండిన ఆనందంలో కూడా
నువ్వో తడి సందడి చేస్తూ
నీ మాతృస్థానానికి వీడ్కోలు చెబుతావు కదూ
అప్పుడేమో నీ పేరు ఆనందభాష్పమట

నీవు నీ మాతృమూర్తి వడి నుండి
జారిపోతున్న క్షణాన
అది దుఃఖమైనా, ఆనందమైనా...
ఎదుటి మనిషి మనసు పొరల్ని మీటి  
దానిలో ఆర్ద్రత కలిగిస్తావు కదూ

మనిషి కష్ట సుఖాల్లో,
భారమైన మనసుల సంవేదనలని గుర్తెరిగి
నీ వీడ్కోలుతో తేలిక పరిచే నువ్వు

నా ఆత్మీయనేస్తానివి… అనంత వేదానివి…!

6 comments:

బావుందండీ,
కన్నీరు చేశేది త్యాగమని చెప్పి, కన్నీరు పెట్టించారు

స్నేహితుడు గారూ బాగారాశారండీ కవిత. మీ బ్లాగ్ పేరు కూడా చాలా బాగుంది.

జ్యోతి గారూ, ఊక దంపుడు గారూ & విశ్వ ప్రేమికుడు గారూ అందరికీ నా కృతఙ్ఞతలు

ఇది మీ తొలి కవిత కదా... మొదట్లోనే ఇంత బాగా రాయగలగడం... చాలా బావుంది!

Post a Comment