Monday, 14 September 2009

కాంగ్రెస్ దేవుడు వై.ఎస్ పాలన అంత బాగుంటే...

పై లోకాల్లో ఉన్న కాంగ్రెస్ తాజా దేవుడు వై.ఎస్. ఆశీస్సులు, ఆయన గారి పై వెల్లు వెత్తుతున్న సానుభూతి ఇవన్నీ కలపి మిగిలిన పార్టీలు అసలు ఖాతాలు ఓపెన్ చేస్తాయా అనిపించింది టెక్కలి ఉప ఎన్నికల్లో . కానీ ఫలితాలు చూస్తే అంత సానుభూతిలోనూ 7 వేల చిల్లర ఆధిక్యం మాత్రమే వచ్చింది. అదీ ప్రతిపక్ష నాయకులెవరూ ప్రచారం చెయ్యకుండా.... వాళ్ళు కూడా పూర్తి ప్రచారం చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో మరి?


నిజం గా రాష్ట్రమంతా వై.ఎస్ మేనియా తో ఊగిపోతుంటే, రెండు సానుభూతులూ (వై.ఎస్ & రేవతీ పతి) కలిస్తే ఎంత భారీ ఆధిక్యం రావాలి పాలక పక్షానికి. ఎన్నో వందలమంది చావులని తన ఎకౌంటు లో వేసుకుని వెళ్ళిన కాంగ్రెస్ దేవుడు వై.ఎస్. గారి పరిపాలన అంత సుభిక్షం గా ఉంటే ఈ పరిస్థితి ఎందుకో పాలక పక్షానికి.

మన భారతీయులు పోయినాళ్ళంతా మంచివాళ్ళే అని ఎలాంటి వాడు చనిపోయినా తన గురించి మంచిమాటలే చెప్పుకుంటాం. అంత మాత్రాన తను చేసిన పనులన్నీ మంచివి అయిపోవు.

ఒక MLA చస్తే ఆయన గారి భార్యామణి లేదంటే సుపుత్రుడో తనూ లేకపోతే సోదరుడో.... వీళ్ళు తప్ప మరో నాయకుడు దొరకనంత దౌర్భాగ్య స్తితి లో ఉన్నాయా మన రాజ కీయ పార్టీలు.

ఈ రోజు వచ్చిన ఫలితం చూస్తే అర్ధమవుతుంది వై.ఎస్.ఆర్ మరణించకుండా ఉండి ఉంటే వచ్చే రిజల్ట్ ఏమిటో....

ఆయన ఈ లోకం నుండే నిష్క్రమించాడు. ఆయన ను పెంచి పెద్ద చేసిన పార్టీ లో ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ వై.ఎస్ గారి అనుచరుల దృష్టిలో ఆ నాయకులెవరికీ ఆయన గారి ఆశయాలను నెరవేర్చే సామర్ధ్యం లేదట ఆయన గారి సుపుత్రుల వారికి తప్ప. ఇదేమన్నా రాచరికమా? తండ్రి పోగానే పదవి కట్ట బెట్టటానికి? ఇంకెందుకు 125 ఏళ్ల చరిత్ర కల పార్టీ మాది అని చంకలు గుద్ది చెప్పుకోవటంతీసుకు వెళ్లి తుంగలో తొక్కుకోక.

ఒక నాయకుడు చస్తే ఆయన గారి ఆశయాలని నెరవేర్చే సామర్ధ్యం లేని నాయకులు కానరాని పార్టీ అయిపోయిందా కాంగ్రెస్ వై.ఎస్. వందిమాగధుల దృష్టిలో ? పొద్దున్న లేస్తే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆత్మ హత్య చేసుకున్న వారి చిట్టా పద్దుల పేపర్ ఒకటి. ఒక్క పనికి వచ్చే న్యూస్ కనపడటం లేదు వారికి జగన్ ముఖ్యమంత్రి కావాలనే తపన తప్ప.

యధా రాజకీయులు తధా వార్తా పత్రికలూ.

ఇదీ నేటి భారతం


మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

7 comments:

"సానుభూతి గెలుపు" అనే పల్లవిని ప్రతిపక్షంవారు కూడా అందుకుంటూంటే విస్తుపోయాను. అంత సానుభూతే ఉంటే మెజారిటీ వోట్లు (70,000) తనకి వ్యతిరేకంగా పడగా కేవలం 59,000 వోట్లే తెచ్చుకుందేంటి కాంగ్రెస్ ? ఇది సాంకేతిక గెలుపు ప్లస్ వాస్తవ వోటమి. అంత సానుభూతే ఉంటే ప్రతిపక్షాలకి ధరావతు కూడా దక్కకూడదు గదా, లెక్క ప్రకారం ? కాబట్టి వై.ఎస్. ఆకస్మిక మరణం పార్టీని, మీడియాని కదిలించినంతగా ప్రజల్ని కదిలించలేదేమో ననిపిస్తోంది.

--తాడేపల్లి

మీడియా హడావుడి ఓ నాలుగు రోజులు ఉండేది, కాకపోతే పచారికొట్టు లో అందుకోనంత ధరలు, కందిపప్పు లేని పప్పుచారూ రోజూ ఉండేవి.

పోయిన ఆయనేమో అపర దేముడు, ఆయనకు తండ్రి ఉండి కూడా పుట్టిన బిడ్డ జగన్ ఏసయ్య అని, గుండేలు పగిలేలా అరుస్తున్న కాంగీ వాళ్ళు, మీడియా వాళ్లను చూస్తుంటే, మరి సాక్షాత్తూ ఆ ప్రభువు, ఆ ప్రభువు బిడ్డ జగన్ ఏసయ్యలు ఉంటే జనాలు బియ్యం, పప్పులు కొనుక్కోలేని రోజులు ఎందుకున్నాయి అని ఆ పొగిడేవాళ్లను అడగాలని అనిపిస్తుంది.

టెక్కిలి ఎన్నికలు చిరు జెండా పీకేయబోటాన్ని కూడ సూచిస్తున్నాయి. సూడాలి, మరి చిరు సలహాదారు డిల్లీ యాత్రలు ఎప్పుడు మొదలెడతారో (ఇప్పుడా, ఎన్నికలకు కొంచం ముందా అనేదే ప్రశ్న!!).

ఇది టెక్కలి ఎమెల్యే మరణం, వై ఎస్ దుర్మరణం అనే రెండు సానుభూతుల పుణ్యాన లభించిన నామమాత్రపు గెలుపు అని గుర్తుంచుకోవాలి. సీపీఐ నారాయణ గార న్నట్టు "టెక్కలి లో కాంగ్రెస్ తన సొంత సీటును ఓడి గెలిచింది " ! గతంలో చంద్ర బాబు కూడా మీడియా మాయాజాలం ను చూసి భ్రమలకు గురై ఏడాది ముందే ఎన్నికలకు వెళ్లి భంగపడ్డ విషయం ఎవరూ మరచిపోలేదు కదా.
అప్పుడు ఆయన ఎన్నికలను సానుభూతి తో స్వీప్ చేసేస్తాననుకుని బోర్లా పడ్డాడు.
అయినా అధినాయకులు పాత కలల్నే కొత్తగా కంటూ త్రిశంకు స్వర్గంలో విహరిస్తున్నారు.
- భాగ్యనగరం లోని ఓ అభాగ్య జీవుడు.

he is the most corrupted fellow. I am glad that,his own sins killed him. YSR made lot innocents get killed in Hindu-muslim riots to get down chenna reddy as CM.

Shame on the people who made this corrupted, factionist as god.

GOD PUNISHED HIM BY GIVING HIM A DEATH LIKE STREET DOG!! HE DESERVES IT

"మన భారతీయులు పోయినాళ్ళంతా మంచివాళ్ళే అని ఎలాంటి వాడు చనిపోయినా తన గురించి మంచిమాటలే చెప్పుకుంటాం. అంత మాత్రాన తను చేసిన పనులన్నీ మంచివి అయిపోవు." ఇంకొంచెం ఘాటుగా రాసి వుంటే బాగుండేదేమో.... చాలా బాగా చెప్పారు.....

Friends, Thanks for all you for your comments

Post a Comment