Thursday, 10 September 2009

సోనియా జీ..... మాకున్న అర్హత 30 ఏళ్ల నెహ్రూ కుటుంబ విధేయత & ఓ కర పత్రిక



జగన్ ని ముఖ్యమంత్రి ని చెయ్యటానికి ఆయన గారి పత్రిక ఎంత కంకణం కట్టుకుందో పైన ఉన్న యాడ్ ని చూస్తేనే అర్ధం అవుతుంది.

2014 లో రాహుల్ గాంధీ ని ప్రధాని చెయ్యాలనే వై.ఎస్ గారి కలని పదే పదే (దాదాపు ప్రతి రోజూ పేపర్ లో టీవీ లో ఇదే భజన) ప్రస్తావించటం దారా రాష్ట్రం లో తమను మించిన విధేయులు వారికెవరూ దొరకరని చెప్పకనే చెప్పేవాళ్ళు. ఈ రోజు దాన్ని పబ్లిక్ గా చెప్పుకున్నారు.

"2014 నాటికి రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని... ప్రజలు తప్పకుండా పట్టం కడతారు " ఈ మాటలన్న వై.ఎస్. ధీమా వెనక ఉన్నది రాహుల్ పై అభిమానమే కాదు ఆ కుటుంబం పై ఉన్న మూడు దశాబ్దాల విధేయత.

అసలు నాకర్ధం కానిది ఈ కాంగ్రెస్ వాళ్ళకి నెహ్రూ గారి వారసుల మీద ఉన్న విధేయత జాతి పిత గాంధీ గారి వారసుల మీద ఏ నాడూ ఉండదు ఎందుకని.?

ఆయన వారసులు ఏ అత్యున్నత పదవుల్లోనూ లేరు కాబట్టి.

రాజ్యాంగ పరం గా అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి విధేయులై ఉంటే తమకూ ఓ పరగణా కు ఆధిపత్యం వహించే అవకాసం ఉంటుంది కాబట్టి.

ప్రజలకు కావాల్సింది నెహ్రూ గారి కుటుంబం మీద విధేయత ఉన్న వాళ్ళు కాదు. ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద విధేయత ఉన్న వాళ్ళు కావాలి.

మా తాతలు నేతులు తాగారూ మా మూతులు వాసన చూడండీ అన్నట్టు గాంధీ దగ్గర నుండి వై.ఎస్. వరకూ ప్రజల మీద ఉన్న విధేయత ఉన్నంత మాత్రాన ఆ విధేయత మాకూ ఉంది అంటే కుదురుతుందా...

కొన్నాళ్ల పాటు దాన్ని నిరూపించుకుంటే వారసత్వం దానికదే వస్తుంది.



మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

3 comments:

ప్రజాస్వామ్యమా నీ పేరు మార్చుకో.... కుటుంబ రాజకీయం పురులు విప్పుకో.... మా తాత రాజకీయవేత్త చాలదా నా మనవడి వరకు రాజకీయాలలో నెగ్గటానికి... కళ్ళెర్ర చేస్తే మాడి మసయ్యి పోతావు జాగ్రత్తా... :-) :-)

మీ అభిప్రాయం తెలిపినందుకు కృతఙ్ఞతలు భావన గారు.

పై ఫొటొలో గాంధీ గారు ఎందుకున్నట్టు? మిగతా ప్రముఖులు స్వాతంత్రం వచ్చిన తరువాత రాజ్యాన్ని ఏలిన ప్రభువులు. ఇది ప్రజాస్వామ్యమంటూనే ప్రజలకి సుర్రుమని వాతపెట్టారు పెద్దలు 'పరిపాలన' అనే పదాన్ని చెర్చి. పరిపాలించేవాడు 'రాజు' కాక ఇంకేమైతాడు? మరి రాజరికం లోనె కదా 'వంశపరిపాలన' వుండేది? మనకీ తిప్పలు తప్పవు.

Post a Comment