07:54
Unknown
ఎన్ని గుండెల మధనంలో నుండి
రాలిపడ్డ కన్నీళ్ళో అవి
నేలపై మహాసంద్రాలని పరచాయి
కంటికి నీరు కరువైన
ఎడారి జీవితంలో
చెలిమి గంధమొక్కటి చాలు
బీటలైన హృదయాన్ని
చిగురింపజేయడానికి
తెలుసుకోలేం కానీ
జీవితంలో అమృతం కురుస్తూనే ఉంటుంది
చెక్కిలి తుడిచే చేతి వేళ్ళ స్పర్శలో నుండి
1 comments:
స్నేహ స్పర్శకు ఉన్న మహత్యం అటువంటిది మరి :-)
Post a Comment