ఆరారు ఋతువులు గ్రీష్మమై
వేసవి వాలిన హృదయంపై
మరువపు శీతలమద్దిన
హేమంతమై స్పర్శిస్తుంటే
తనని నా స్వార్ధం చేసుకున్న
ఆ మొదటి క్షణంలోనే అనుకున్నా
తన ఎదురుచూపుల నిండా
నేనే ఉండాలని
కానీ
ఈ స్వార్ధమెంత మాయావో తెలుసా మీకు
నా నిరీక్షణలకి తనని జీవంగా మార్చింది
తన ప్రతి క్షణానికీ కిరీటం తొడిగి
నా సమయాల సింహాసనంపై
తనని కూర్చోబెట్టాక
యుగాల లెక్కలూ తారుమారవుతున్న
చిత్రాతి చిత్రపు మాయాజాలం ఐతేనేం
అలసట తెలియని నిశ్శబ్ద తీరంలో
తను వదులుతున్న శ్వాస
నా ఊపిరిగా మారుతున్నప్పుడల్లా
ఇష్టంగా మిమ్మల్ని చేరింది కదూ
ఒకరికి ఒకరం స్వార్ధంగా మారుతూ
మేముగా మాలో లీనం అయిన చప్పుడు!!
వేసవి వాలిన హృదయంపై
మరువపు శీతలమద్దిన
హేమంతమై స్పర్శిస్తుంటే
తనని నా స్వార్ధం చేసుకున్న
ఆ మొదటి క్షణంలోనే అనుకున్నా
తన ఎదురుచూపుల నిండా
నేనే ఉండాలని
కానీ
ఈ స్వార్ధమెంత మాయావో తెలుసా మీకు
నా నిరీక్షణలకి తనని జీవంగా మార్చింది
తన ప్రతి క్షణానికీ కిరీటం తొడిగి
నా సమయాల సింహాసనంపై
తనని కూర్చోబెట్టాక
యుగాల లెక్కలూ తారుమారవుతున్న
చిత్రాతి చిత్రపు మాయాజాలం ఐతేనేం
అలసట తెలియని నిశ్శబ్ద తీరంలో
తను వదులుతున్న శ్వాస
నా ఊపిరిగా మారుతున్నప్పుడల్లా
ఇష్టంగా మిమ్మల్ని చేరింది కదూ
ఒకరికి ఒకరం స్వార్ధంగా మారుతూ
మేముగా మాలో లీనం అయిన చప్పుడు!!







1 comments:
మంచి ఎక్స్ప్రెషన్.
మొదటి క్షణం అని మీరు చాలా చోట్ల రాస్తారు కదా మీకలాంటి మొదటి క్షణం నిజంగా గుర్తుందా? అలా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి ప్రేమల్లోనే ఉంటుందేమో కదా... అలాంటివేమీ లేవు ఇది కేవలం కల్పితం అనేది మీ జవాబైతే రిప్లై అవసరం లేదులెండి.
Post a Comment