అభిప్రాయం మారటానికి పెద్ద కారణం ఏమీ అవసరం లేదు...
తన సమస్య నీకొస్తే చాలు...!
***
ప్రసాదాలు నైవేద్యాలూ దేవుడేదో తినేస్తాడని కాదు…
ఆత్మాభిమానంతో ఆకలిని చంపుకునేవారు కొందరుంటారని...!
***
ఏమీ పర్లేదు… స్వార్ధపరుడిగానే ఉండు…
కాకుంటే స్వార్ధాన్ని విస్తృతం చేసేయ్…
‘నా’ నుండి ‘మన’ వరకూ
***
తరతరాలుగా అబద్ధానిదే అగ్రాసనం...
నాలుగు రంగుల ఝండా మువ్వన్నెలుగా చలామణి అవుతూ...!
***
ఆకలైతే చాలు అదృష్టమే అనుకునే వాడొకడు
కలలోకీ మెతుకు చేరని మాయేమిటో తెలియని వాడింకొకడు...
ఎంత చిత్రమీ ప్రపంచం
బహు విచిత్రమీ మాయాజాలం
****






2 comments:
చిన్ని చిన్ని చరణాల్లో చక్కని వాక్యాలు.
మొదటిది చాలా బాగుంది.
Post a Comment