ఓటమి పరిచయం అస్సలు ఇష్టపడని నువ్వు
ఎప్పుడూ గెలుపుకి ప్రతీకగా ఉండాలని అనుకుంటావ్
అపజయమో అంటరానితనం అనుకునే నువ్వు
విజయంతోనే జీవితపు తొలి అడుగు వెయ్యాలనుకుంటావ్
అలా లోకాన్ని చూద్దాం రమ్మంటే
ఎప్పుడే ఓటమి తనలోకి లాక్కెళ్ళుతుందో అనుకుంటూ
నిన్ను నువ్వు ఒక స్తబ్ధించిన నరాల వలలో దాచేసుకుంటావ్.
ఎప్పుడూ తిమిరాన్ని తాగుతూ చీకటి అలవాటైన నువ్వు
ఒక్కసారిగా వెలుగు కిరణం సోకితే
చటుక్కున కళ్ళు మూసేసుకుంటావ్.
నిజమే….
నువ్వు చాలా నేర్చేసుకున్నావ్
భద్రంగా దాగిఉంటే ఓటమి దరి చేరదని
పాపం విజయమే నేర్చుకున్నట్లు లేదు
నిన్ను నువ్వు కప్పేసుకున్న చోటులో తాను చుట్టేసుకోవాలని
అందుకేనేమో
పరిచయం చేసుకుందామని వచ్చిన విజయమొకటి
నీకు నిశ్సబ్దంగా వీడ్కోలు చెప్పేస్తుంది
నువ్వు దాగిన చీకటి జీవితాంతం నిన్ను తాగేస్తూ
ఓ అపజయపు కౌగిలింతగా
నిన్ను హత్తుకుపోయిన క్షణాలని చూస్తూ
నీ ఆటకి నిన్ను వదిలేస్తూ

2 comments:
chala baga chepparu
చాలా బావుంది నెగటివ్ ఎక్స్ప్రెషన్.
Post a Comment