వానలో తడచిన ఆకుల పచ్చి వాసన పీల్చుకున్నాక తెలిసింది... అంటిన మలినాన్ని కడిగాక మాటలకందని పసిప్రాయమొకటి మనసుని తడిమేస్తుందని. పచ్చని ఆకు నగ్నత్వం ప్రకృతి మొత్తాన్నీ పరిమళించినట్లుగా మాయతెరలు కప్పని మనసు మనిషిని మనిషిగానే లోకానికి ఇస్తుందని.
కంటిమీదకి ఆవాహన చేసుకుంటున్న దృశ్యా దృశ్యాలన్నీ వాస్తవాలని పరిచయిస్తుంటే… ఇవే వాస్తవాలు కొందరికి కలలుగానే ఉండిపోతున్నాయన్న ఆలోచన చెప్పింది మనసు నడక తీరుతో మనిషి బతుకు తీరుల చిత్రవిచిత్రాలని.
మనిషికి మనిషిని దూరం చేసే భావావేశాలు చుట్టుముట్టినప్పుడూ… తనలోని తనని ఛిద్రంచేసే వేదనలు ముంచెత్తినప్పుడూ కాసేపు తను ‘మిథ్య’గా మారిపోతే ఏమవుతుంది… తను తన స్వచ్ఛతని నిలుపుకోవటం తప్ప? చినుకు తడిమినప్పుడల్లా మిథ్యగా మారిపోతున్న తామరాకు చెప్పిన నగ్న సత్యమే నాకో కొత్త పాఠం అయ్యింది.

0 comments:
Post a Comment