మన భ్రమణం మొత్తం వలయంలోనే సాగిపోతుంది గమ్యం నిర్దేశించుకోలేని ప్రణాళికలతో... అపజయాల నెపం మొత్తం పరాయి మీద వేసేస్తూ స్వవిలువని... స్వశక్తిని గుర్తించలేని మనిషితనంలో ఒదిగికూర్చున్నాం.
ఇలాంటప్పుడే పరుసవేది ఒకటి కావాలి ఈ లోకానికి ఇనుముని బంగారం చెయ్యటానికి కాదు. బతుకుని జీవంగా మార్చుకోవటానికి. అన్వేషణ మొదలెడదాం. పురాశిధిలాల తవ్వకాల్లో కాదు. అంతరంగ ఫలకాలలో లిఖించబడ్డ ఆత్మవిశ్వాసపు నిధి రహస్యాన్ని ఛేదిద్దాం.
అంతఃచైతన్యం రాసిన వీలునామాని లోకానికి వెల్లడి చేద్దాం అలుపెరుగని అన్వేషణతో అంతరంగ మూలాలని శోధించి ... మనవైన జీవితాలలో నరనరానా ప్రకృతి దాచిన ఎనలేని నిధులతో లోకాన్ని జయిద్దాం.







0 comments:
Post a Comment