23:30
Unknown
నిన్ననగా గుండెని తాకిన నవ్వొకటి
ఇంకా నరాలనిండా పయనం చేస్తూనే ఉంది
కనులు దాయలేని తడొకటి
నన్నింకా తడుముతూనే ఉంది
ఒక నవ్వు
ఒక దుఃఖం
ఏకమైన ప్రతిక్షణం
అచ్చంగా మనదే కదూ
ఏయ్.. సహచరీ !
నా ఊపిరంతా నీలో నుండి కురుస్తున్న నిజం
కొత్తదేం కాదు కానీ
ఇప్పుడైతే
కాలానికి కనికట్టు కట్టేసింది నీ సమక్షం
1 comments:
ఎందుకో తెలీదు గానీ దాసరిగారు రాసిన 'ముక్కుపచ్చలారని కాశ్మీరం'పాట గుర్తుకువచ్చింది మీ కవిత చదివితే.
Post a Comment