దోసిలి నిండా చిన్ని నవ్వులు చాలు అన్నాను
గుండెనిండుగా స్వేచ్ఛని నింపుకొచ్చావు
ఒక్క వెదురు ముక్కని తీసుకు రావూ అన్నాను
నన్నలరించే హేమంతపు పాటనే తెచ్చావు
ఒక్క నిమిషం నాతో ఉండమన్నాను
నీ కాలాశ్వపు పగ్గాలే నాకందించేశావు
నువ్వు
అనంతంగా నన్నలరించటానికి
నాకోసమొచ్చిన అక్షయానివని తెలిసి
అణువణువునా నిన్ను నాలో ప్రణవిస్తూ
ఇప్పుడిక
మది నికుంజాలలో నిశ్శబ్దపు శబ్దం చేస్తున్నా







0 comments:
Post a Comment