08:00
Unknown
కాలం ఇంకిపోయే కొద్దీ
చేతలు త్వరపడటం అన్నది
శతాబ్దాలుగా
ఎరిగిన సత్యమన్నది
తెలిసీ
నిన్ను నువ్వు బద్ధకించుకుంటూ
వాయిదా వేసిన అనేకానేకాలను
కాలం నీకు మాయం చేసిన సంగతి
నీ దృష్టికి ఎన్నడూ రాకపోవటం
దృష్టి లోపమేమీ కాదు
అది ఆ అవకాశం జారిపోవటమూ
నిన్ను నువ్వు కోల్పోవటమూ కూడా
0 comments:
Post a Comment