పువ్వులూ, చెట్లూ, పక్షులూ, జంతువులూ , రాళ్ళూ రప్పలూ ..
ఇవేవీ ఇంకా దేవుణ్ణి కనిపెట్టలేదు..
కొండొకచో తామే దైవాలయ్యాయి గానీ.
వీటన్నిటికీ ఆలోచనలు మొదలైతే ప్రకృతిని పరవశిస్తాయి గానీ అవి దేవతలనో దేవదూతలనో కనిపెట్టవు. కనీసం వాటికవి పేర్లు కూడా పెట్టుకోవు. ఏ వాంఛల్లో మునకలెయ్యవ్. వాటి ఆలింగనాలన్నీ ఈ ప్రపంచానికి ఆరోగ్యవంతమే.
వాటన్నిటితో పోలిస్తే మనిషి ఎంతటి అవివేకి.. తన వివేకంతో సృష్టించున్న మతాలలోనే శలభంలా కొట్టుకుంటూ…!
దేవుడి పేరుతో తమ జాతినే చంపుకునే ఏకైక జీవి కూడా మనిషే. కాదంటారా?
ఎప్పటికీ మనిషి ఒప్పుకోని నిజమొకటే..
మనిషంటే మతమని.. మతమంటే మారణహోమమని. మృత్యుహేల మొదలైతే ఆపే ఆపద్భాందవుడంటూ ఎవడూ లేడని...
ఏదైతేనేం నాకర్ధం అయ్యిందొక్కటే.. ఆలోచన పుట్టటమే మనిషన్నవాడికి శాపంగా మారిందని, మస్తిష్కమే మనిషికి మరణ శాసనమయ్యిందని.
ఓ గడ్డి పువ్వు ఆలోచించటం నేర్చుకుంటే
ప్రకృతిలో తనకో బాధ్యత ఇవ్వబడిందని
దానిని తను మాత్రమే నేర్చాలనే
నిజాన్ని గ్రహిస్తుందేమోగానీ
దేవుళ్లనో..
దైవకుమారులనో కనిపెట్టదనుకుంటా
అనంత విశ్వాన
దేవుడి ఉనికికి ఊపిరద్దింది
మనిషి కాక మరెవరని
మరే జీవికైనా
దైవం గురించి ఏమి తెలుసని
మనిషి తన విజ్ఞానంతో
సృష్టించుకున్న అజ్ఞానపు అంధకారం
మతం
అదే కదా
తన నాగరికత అభిమతాలన్నిటికీ కేంద్రకం
తన జాతి విచ్చిన్నతకి ఆరంభం
ఎంత విచిత్రమో కదా ఈ వినాశనం







1 comments:
well said..
Post a Comment