ఎప్పుడు మొదలయ్యానంటే ఏమి చెప్పను?
ఎలా మొదలయ్యనో నాకు మాత్రం ఏమి తెలుసనీ…!
మీకున్నట్టు నాకెవ్వరూ లేరు నా తొలిఅడుగుని స్మృతిపరచటానికి నాకు ముందుగానో... నా తరువాతనో వచ్చే నా వాళ్ళంటూ ఎవ్వరూ లేరు.
నాకు నేనే... ఇహాన్ని.
నాకు నేనే... అహాన్ని.
మీరనే అనాధత్వంలో బహుశా తొలి అనాధని నేనేనేమో!
నా తరపున వకాల్తా పుచ్చుకోవటానికి మరెవ్వరూ లేనంత ఈ ఏకాకి జీవితంలో ఈ లోకపు జరామరణాల సత్యాన్వేషణలో నేనెప్పుడూ ప్రధాన ముద్దాయినే.
పరుగాపిన సందర్భమంటూ ఒక్కటి కూడా లేని పని రాక్షసినై నేనుంటే, తానాగితే బాగుండు అని తమ జీవితంలో నా గురించి ఒక్క సారైనా అనుకోని మనిషంటూ ఉన్నాడా?
ఎండానీడల్లో...యంత్రపరికరాల్లో…చక్రభ్రమణాల్లో నా ఉనికిని భద్రపరిచామనుకుంటూ... నా ఊపిరిని మనసారా స్పర్శించలేని ఓ మనిషీ… విజ్ఞాన ఖనీ ( :p )
నీ
ఎడతెగని అన్వేషణకి సిసలైన నిర్వచనాన్ని నేను…
ఏయ్ మనిషీ...
నిత్యాహంకారీ !
ఏదీ నీకు చేతనైతే నా ఆద్యంతం కనిపెట్టు చూద్దాం…
ఇంతకూ నా పేరైతే నీకు తెలుసుగా...
తెలిస్తేనేంలే మరోసారి చెబుతున్నా విను.
నా పేరు
‘కాలం’







1 comments:
very good. meaningful.
Post a Comment